రామ్‌చరణ్ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ వట్టి పుకార్లు

chiru-ramcharan-new-stillsరామ్‌చరణ్, శ్రీనువైట్ల సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ పోషిస్తున్నాడన్న వార్త గత కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. చెర్రీ ఇందులో ఫైట్ మాస్టర్‌గా నటిస్తున్నాడని.. ఓ సందర్భంలో హీరోగా కనిపించే చిరంజీవికి ఫైట్స్ కంపోజ్ చేస్తాడని సీన్స్ కూడా అల్లేశారు. చిత్ర రచయిత కోన వెంకట్ మాటలు వింటే.. ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.

ట్వీట్ చేస్తూ.. ‘రామ్‌చరన్ సినిమాపై రకరకాల ఊహాగాలునాలు.. వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ పుకార్లు నవ్వు తెప్పించేలా వున్నాయి. అవేవీ నమ్మకండి. ఏమైనా విశేషముంటే మేమే చెబుతాం’ అంటూ రాసుకొచ్చాడు కోన. ఈలెక్కన రామ్‌చరణ్ సినిమాలో చిరంజీవి నటించడం ఒట్టి పుకారే అన్నమాట.