‘ధృవ’ టీంకు షొక్కిచ్చారు మెగా స్టార్

chiru-dhruvaChiranjeevi gave shock to Dhruva team

మెగా స్టార్ చిరంజీవి తన సినిమానే కాదు తన తనయుడి సినిమాపై ద్రుష్టి సాధిస్తున్నారు , రొండు అపజయాలతో ఫారం కోల్పోయిన రామ్ చరణ్ ప్రస్తుతం ‘ధృవ’ సినిమా చేస్తున్నాడు.

చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’వ సినిమాతో బిజీ గా ఉన్న , ‘ధృవ’ టీంకు షాకిచ్చారు . ప్రస్తుతం చెర్రీ ధృవ‌ టైటిల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. బోస్కో – సీజర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ తెరకెక్కుతుంది.

అయితే మెగా స్టార్ చిరంజీవి టైటిల్ సాంగ్ తెరకెక్కించే విధానాన్ని లైవ్ లో చూసేందుకు ‘ధృవ’ సెట్స్ కి వెళ్ళాడు. చిరు ఎంట్రీతో ధృవ టీం ఒక్కసారిగా షాక్ కు గురిఅయ్యారు ,సెట్ సందడిగా మారింది, ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు.

ధృవ సినిమా ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనుండగా మూవీని డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నారు.