పార్టీ మారే ఆలోచన లేదు : చిరంజీవి

chiranjeeviకాంగ్రెస్ రాజ్యసభ్యుడు చిరంజీవి ,తాను పార్టీ మార‌తున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదంటున్నారు , తాను బీజేపీలో చేరడం లేదని చిరు తేల్చి చెప్పారు .

అందులోను నమస్తే తెలంగాణ పత్రిక కదనం ప్రకారం చిరంజీవి వచ్చే నెల(మార్చి 6న) కాషాయ కండువా కప్పుకుంటారనే వార్త ప్రచారించారు . మార్చి ఆరున బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చిరంజీవిని బిజెపిలో చేరుతారని, మాజీ మంత్రి కన్నా లక్మీనారాయణ ఇందులో చొరవ తీసుకుంటున్నట్లు చెబుతున్నారని , ఆ పేపర్ కదనం.

చిరంజీవి బిజెపిలో చేరి,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్న ఆలోచన ఉందని చెబుతున్నారు.2019 ఎన్నికలలో బలమైన శక్తిగా ఎదగడానికి కాపు వర్గంలో పట్టు సాదించాలని బిజెపి యత్నిస్తోందని చెబుతున్నారు.

బీజేపీలో చేరుతున్న‌ట్టు వ‌స్తున్న వందంతుల‌ను కొట్టి పారేశారు, చిరంజీవి. మీడియాలో వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని , రాజకీయాల్లో ఉన్నంతవరకూ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చిరంజీవి తెలిపారు.