ముద్రగడ అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన చిరంజీవి

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి, కాపు ఉద్యమ నేత, ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో స్పందించారు.

చిరంజీవి శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం అరెస్ట్ను ఆయన తీవ్రంగా ఖండించారు.

కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని,టిడిపి ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన విధంగానే హామీని నెరవేర్చాలని ముద్రగడ కోరుతున్నారని , అరెస్ట్లు ఏకపక్షంగా ఉన్నాయని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.

సున్నితమైన సామాజిక సమస్యను ప్రభుత్వం సంయమనం పాటించి పరిష్కరించాలని చిరంజీవి సూచించారు. కొన్ని చానళ్లను నిలిపేయడం మంచిది కాదని అన్నారు .

chiranjeevi