జగన్ మోహన్ రెడ్డి ఆస్తులను టార్గెట్ చేసిన చంద్రబాబు

naidu-jaganఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వై సి పి నేత జగన్ మోహన్ రెడ్డి ఆస్తులు పై టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది .

అవినీతి కేసులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిదులు మొదలైనవారిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారి ఆస్తులను జప్తు చేసి , ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదీనంలోకి వెళ్లిన ఆస్తులను రాష్ట్రానికే దక్కేలా ఒక బిల్లు తేవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇదే జరిగితే ఈడీ, సీబీఐ వంటి సంస్థలు జప్తు చేసిన జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోని ఆస్తులు, దేశవ్యాప్తంగా వివిధ చోట్ల పట్టుబడిన ఎర్ర చందనం రాష్ట్రానికే దక్కే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కసరత్తు జరుగుతోంది. ఎపి మంత్రి వర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది, చంద్రబాబు నాయుడు అద్యక్షతన సమావేశమై చేసిన తీర్మానాలలో ఇది ఒక్కటి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సలహాతో ఈ బిల్లుకు రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబు సమావేశంలో వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాలో ఓటుకు నోటు కేసు లో జగన్ చంద్రబాబు ను ఇరుకున పెట్టకొండ చూసేందుకే , జగన్ ఆస్తులు పై టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది .