చంద్రబాబు చేసిన పాపాలను కాశీకి వెళ్లి ప్రక్షాళన చేసుకోవాలి : జగన్

jagan-chandra-babu-naidu1గోదావరి పుష్కరాలలో రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోన్ రెడ్డి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీవీఐపీ ఘాట్‌కు వెళ్లకుండా పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లారని విమర్శించారు.ఆయన రాక కారణంగా వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన పాపాలన్నీ రాష్ట్రానికి శాపాలుగా మారుతున్నాయని, జరిగిన దానికి బాబు కాశీకి వెళ్లి పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఆయన అన్నారు.

ఏర్పాట్లుపై జగన్ ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ వైఫల్యాల కారణంగా మాత్రమే ఈ సంఘటన చోటు చేసుకుందని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యత పుష్కర పనుల నాణ్యతా పనులకు ఇవ్వలేదని ఆరోపించారు.