పవన్ అంటాడు మనం పడదాం : చంద్రబాబు

pawan-naiduటీడీపీ ఎంపీలపై జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలను టిడిపి ఎమ్.పిల సమావేశంలో ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా స్పందించారు .

ఏమయ్యిందిప్పుడు పవన్ మన మిత్రుడేగా…!! అననివ్వండి పడదాం… ఆయనపై నోరు పారేసుకోవద్దు.. మనమేం చేశామో జనంలో చెప్పుకోలేమా.. ఏంటి..? పవన్ కళ్యాణ్ పై విమర్శలు వద్దని ఎమ్.పిలకు సూచిస్తూ, ఆయన మనకు మిత్రుడు అని అన్నారు.విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారని, వాటికి సమాదానం చెప్పాలని ఆయన సూచించారు.

విలేకరులతో మాట్లాడతూ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమకు మిత్రపక్షమని స్పష్టం చేశారు. ఆయనతో ఎలాంటి విబేదాలు లేవని అన్నారు.ఆయన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.