పవన్ తో చంద్రబాబు డబల్ గేమ్ ఆడుతున్నారు

pawan-kalyan -naiduవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హైదరాబాద్ లో మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుకున్నంత కాలం వాడుకుని ఇప్పుడు వదిలేశారని ఆరోపించారు.

పవన్ పై టీడీపీ ఎంపీలు విమర్శలు గుప్పించడం సామాన్యమైన విషయం కాదని.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందని ఆయన అన్నారు. బాబు ఆమోదముద్ర లేనిదే టీడీపీ ఎంపీలు ఏమీ చేయలేరని చెప్పారు. ఏదేమైనప్పటికీ.. ఎవర్నైనా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని అంబటి మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న డబుల్ గేమ్ అని అంబటి విరుచుకుపడ్డారు.