ఓటుకు నోటు కేసు చార్జీషీట్‌ లో చంద్రబాబు ప్రస్తావన

naiduఓటుకు నోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జీషీట్‌ మీడియాకు లీక్ అయింది , అందులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ఇరవై రెండు సార్లు ప్రస్తావించారని సమాచారం, లీకైన చార్జీషీట్‌లో చంద్రబాబు పేరు ఉండటం టీడీపీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

సెబాస్టియన్ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇంటికి స్టీవెన్సన్ ను తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారని, కాని ఆయన అందుకు అంగీకరించలేదని ,దాంతో చంద్రబాబు తరుపున రేవంత్ రంగంలో దిగారని చార్జీసీట్ లో పేర్కొన్నారు. .టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయించే పనిని చంద్రబాబు తనకు అప్పగించారని రేవంత్ చెప్పడాన్ని పేర్కొన్నారు. చంద్రబాబు తరుపున తానే బేరాసారాలు చేస్తున్నానన్న అంశాన్ని హైలైట్ చేశారు. నేరుగా స్టిఫెన్ సన్‌తో చంద్రబాబు మాట్లాడారని ఏసిబి వెల్లడించింది.” దే బ్రీఫుడ్ మీ “అంటూ మొత్తం సంభాషణను చార్జీషీట్‌లో పొందుపరిచింది. మొత్తం మీద ఇరవై రెండు సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చింది.

ఈ చార్జీషీట్ లో మాత్రం చంద్రబాబు పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చేందుకు బలమైన ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అదనపు చార్జీషీట్ వేసినప్పుడు చంద్రబాబు పేరు చేర్చవచ్చని తెలుస్తోంది.