చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం

naiduప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకోనున్నారు .

కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం ఉదయం రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు

ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాము. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి న్యాయంగా రావాల్సినవి అడిగాను. కానీ అటువైపు నుండి ఎటువంటి స్పందనా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చింది. మనకుండే ఇబ్బందులు మనకున్నాయి. నష్టపోతామనే ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాలా ప్రయత్నం చేశాను. కానీ ఫలితం రాలేదు. అందుకే ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి రేపు ఉదయం రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర కేబినె‌ట్‌లో ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగడంలేదనే ఉద్దేశంతోనే చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాం. అని చంద్రబాబు వివరించారు.

బాధ్యాతాయుతమైన సీనియర్ రాజకీయ నాయకుడిగా కేంద్ర మంత్రుల రాజీనామా నిర్ణయం గురించి ప్రధానికి చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఇక్కడ చేయాల్సింది రాజకీయాలు కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపిని వ్యతిరేకించాను. ఈ నిర్ణయం తీసుకోకుంటే ఇంకా నష్టం జరుగుతుందనే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఆయన అన్నారు.