జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం తో ఊగిపోయిన చంద్రబాబు

naiduఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజే అధికార, విపసక్ష సభ్యుల మధ్య వాడి వేడి విమర్శలు చెలరేగాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమండ్రి ఘటనపై చర్చకు సిద్ధమని, సబ్జెక్ట్ చర్చిస్తే అభ్యంతరం లేదని, అలాకాకుండా ఏది బడితే అది మాట్లాడితే ఊరుకోబోమని , వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, అజెండా ప్రకారం రావాలని దాని ప్రకారం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

ఇష్టం వచ్చినట్లు చేస్తే తాము ఏ విధంగా చేయాలో ఆ విదంగా చేసి తీరతామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.