ఏపీ ప్ర‌త్యేక హోదా ప్రాణత్యాగం చేసిన మునికోటి మృతి పై చంద్ర‌బాబు దిగ్భాంతి

chandrababuఏపీ ప్ర‌త్యేక హోదా ప్రాణత్యాగం  చేసిన మునికోటి ,మృతి పై ఏపీ సీఎం చంద్ర‌బాబు దిగ్భాంతి తెలియజేసారు. తిరుపతి కాంగ్రెస్‌ సభలో వంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న మునికోటి చెన్నైలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు..

దీనిపై స్పందిస్తూ , ప్ర‌త్యేక హోదా కేంద్రం ఇస్తుంద‌న్న న‌మ్మ‌కం మ‌న‌కు ఉంది. కాబ‌ట్టి ఎటువంటి తొంద‌ర‌పాటు చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌ద్దు: మీ ప్రాణాలు మీకుటుంబానికి, స‌మాజానికి ఎంతో విలువైన‌వని గుర్తుంచుకోవాలిని, అన్నారు చంద్ర‌బాబు. మునికోటి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.