చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కంటే ఓటుకు కోట్ల పై ఎక్కువ హోంర్క్ : జగన్

jagan-chandra-babu-naidu1రాష్ట్రాన్ని విభజించి నప్పుడు జగన్ ఎక్కడ దాక్కున్నారు అన్న చంద్రబాబు ప్రశ్నకు జగన్ మోహన్ రెడ్డి దీటుగా సమాదానం ఇచ్చారు.

అబద్దాలు, అర్ధ సత్యాలతో చంద్రబాబు అందరిని తప్పు దోవ పాటిస్తున్నారని జగన్ విమర్శించారు . లోక్ సభలో 19 రోజులకుగానూ 5 సార్లు తాము అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చామని, అయితే ఒక్కసారి కూడా తమ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించలేదన్నారు.

చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కంటే ఓటుకు కోట్ల వ్యవహారంలో ఎక్కువ హోంర్క్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబుకు ప్రత్యేకహోదా గురించి పూర్తిగా తెలియదని, ప్రత్యేకహోదా వల్ల కేంద్రం 90 శాతం నిధులు, 10 శాతం లోన్ గా ఇస్తుందని , పన్ను రాయితీలు కూడా వస్తాయని ,అప్పుల ఒత్తిడి రాష్ట్రంపై తక్కువగా ఉంటుందని చెప్పారు.