జగన్ ఆస్తుల కేసులో సీబీఐ మరిన్ని ఆధారాలు

jagan1వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్,తన కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రపతిని కలిశారని, తెలుగుదేశం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు.

కెసిఆర్ అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నా,జగన్ మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. జగన్ కు కొన్ని రికార్డులు ఉన్నాయని, దీక్షలు చేయడంలోను,జైలులో ఉండడంలోను రికార్డు సృష్టించారని అన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో జనానికి అదనపు ఖర్చు పెడుతున్నాడు , అన్నారు గాలి .

మరోవైపు, జగన్ ఆస్తుల కేసులో సీబీఐ మరిన్ని ఆధారాలు అందుకునే పనిలో పడింది. దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్‌కు హవాలా రూపంలో సొమ్ము అందిన అంశానికి సంబంధించిన ఆధారాల్ని సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలో దాల్మియా సిమెంట్స్‌కు చెందిన జోయ్ దీప్ బసు అనే వ్యక్తి నుంచి ఓ పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకొని చూడగా.. ‘3500 టన్నుల స్టాక్ అందింది.. ఇంకో 500 టన్నులు పంపండి’ అని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి పంపిన ఈ మెయిల్ కనిపించింది.