బ్రూస్‌లీ తో పోటిగా రుద్రమదేవి నిలుస్తుందా ?

rudhramadevi-bruce-lee-fighterఅక్టోబరు 16న రాబోయే , రామ్చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’తో పోటిగా అక్టోబరు 9న విడుదలైన గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి సినిమా నిలుస్తుందా ?

కష్టమనే చెప్పాలి , అక్టోబరు 16న రాబోయే ‘బ్రూస్‌లీ’తో రుద్రమదేవి వసూళ్లకు గండి పడే అవకాశాలున్నాయి. ‘బ్రూస్‌లీ’ కోసం రుద్రమదేవిని కొన్ని థియేటర్ల నుంచి తొలగించాల్సివస్తుంది.

దాసరి నారాయణరావు అన్నట్లు , రెండు పెద్ద సినిమాల మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండేలా చూసుకోవడం ఉత్తమం. రామ్ చరణ్ కూడా సినిమాల మధ్య కనీసం రెండు వారాల విరామం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అల్లుఅర్జున్ మాత్రం , సంక్రాంతి సీజన్‌లో రెండు సినిమాలొచ్చి, ఆ రెండు బాగా ఆడిన సందర్భాలున్నాయని, సినిమాలో దుమ్ముండాలి అన్నారు .

బాహుబలి విడుదల సమయంలో శ్రీమంతుడు వెనక్కి వెళ్లింది , దాంతో బాహుబలి కి బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కోరిసింది , అదే స్పర్తి తో కిక్2 నిర్మాతలు కూడా పోస్త్పోనే చేయడం తో శ్రీమంతుడు కూడా బాక్సాఫీస్ వద్ద స్టామిన ప్రదర్శించింది .

కానీ ‘రుద్రమదేవి’ విషయాని కొస్తే , ఆ సినిమా ఎన్నో సార్లు పోస్ట్ పోనే చేసారు , దాంతో సినిమా విడుదల డేట్ చివరి వరకు సస్పెన్స్ లో పడింది . మరోవైపు బృసులీ నిర్మాతలో రిలీజ్ డేట్ ని ఎపుడో అనౌన్స్ చేసారు . ఇప్పుడు బృసులీ రావడం వల్ల కావల్సినన్ని థియేటర్లు దొరకడం లేదు రుద్రమదేవికి . ఈసినిమాని బలవంతంగా తీసేయాల్సివస్తోంది, దాంతో వచ్చే వసూళ్లకు గండి పడుతోంది. ఇపట్టికైనా పెద్ద సినిమా నిర్మాతలు ముందుగానే మాట్లాడుకొని డిసైడ్ అవ్వడం మంచిది.