ఆమరణ దీక్ష చేస్తే హోదా వచ్చేలా పవన్ తో బీజేపీ డీల్

pawanఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. ఎన్డీఏకు టీడీపీ గుడ్ బై. ఎన్డీఏ నుండి వైదొలగాలని పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స. సొంతంగానే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం. ఎన్డీఏలో ఉండగానే కేంద్రంపై అవిశ్వాసం పెట్టనున్న టీడీపీ. భాగస్వామ్య పక్షమే అవిశ్వాసం పెట్టిన విషయాన్నీ..జాతీయ స్థాయిలో ఫోకస్ చేయాలనీ నిర్ణయం. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, అన్నాడీఎంకే మద్దతు

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ , వైసీపీకి మద్దతు ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే కేంద్రంపై టీడీపీ ప్రత్యేకంగానే అవిశ్వాసం. వైసీపీ నోటీసుపై ఐదుగురే సంతకాలు చేశారు. టీడీపీ నోటీసుపై 16 మంది సంతకాలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇతర పార్టీలు సానుభూతిగా ఉన్నాయి. ఏపీకి న్యాయం జరగాలన్నదే మా డిమాండ్. ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. జగన్, పవన్ లతో కేంద్రం కలిసి డ్రామా ఆడుతోంది.
అవిశ్వాసం పెట్టి, రాజీనామాలు చేస్తే జగన్ ద్వారా హోదా ఇవ్వాలని బీజేపీ కుట్ర. ఆమరణ దీక్ష చేస్తే హోదా వచ్చేలా చేస్తామని పవన్ తోను బీజేపీ డ్రామా . ఆంద్రప్రదేశ్ కు వ్యతిరేకంగా మహా కుట్ర జరుగుతోంది. దోషులను వదిలిపెట్టం..ప్రజా కోర్టులో నిలబెడతాం. కుట్ర జరుగుతోందనడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలి. వైసీపీకి సహకరిస్తానని పవన్ చెప్పినట్లు ఎంపీ వరప్రసాద్ చెప్పారు. పీఎంవో చుట్టూ విజయసాయి రెడ్డి ప్రదక్షిణలు చెప్పారు. పీఎంవో పవిత్ర కార్యాలయం..అక్కడ ఏ1, ఏ2 నిందితులకు పనేంటి ? , అన్నారు  చంద్రబాబు