తొక్కిసలాటపై బాలకృష్ణ దిగ్భ్రాంతి

balakrishnaరాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాటపై ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందిన ఘటనపై  బాలకృష్ణ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. తన అభిమానులు పుష్కరాల్లో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని బాలయ్య పిలుపునిచ్చారు.