బాహుబలి చిత్రం దేశానికే గర్వకారణo

modi-prabhas‘బాహుబలి’ హీరో ప్రభాస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. బీజేపీ నేత, కృష్ణంరాజు, పెద్దమ్మ శ్యామలతో కలిసి మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ భుజం తట్టి ప్రశంసించారు. ‘బాహుబలి’ చిత్రం దేశానికే గర్వకారణమంటూ ప్రధాని కొనియాడారు.

ఆదివారం కేంద్ర మాజీ మంత్రి అయిన తన పెదనాన్నతో మోదీ 10 నిమిషాల పాటు సమావేశం అయ్యారు . బాహుబలి సినిమా గురించి విన్నానని ఈ చిత్రం బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ తెలిపారు. ఈ చిత్రాన్ని తప్పకుండ చూడాలని ప్రభాస్ కోరగా ప్రస్తుతం బిజీ గ ఉన్నానని, తరువాత తప్పకుండ చూస్తానని మోదీ అన్నట్లు ప్రభాస్ తెలిపారు.

‘మీ అభిమానుల్లో నేనూ ఒకడిని సార్‌’ అంటూ ప్రభాస్‌ మోడీకి పాదాభివందనం చేశారు. ప్రధాని మోదీ ని కలవటం తన జీవితంలో చాలా సంతోష కరమైన రోజని ప్రభాస్ అన్నారు.

మోడీ ఓ ట్వీట్ చేశారు. ‘బాహుబలిని కలిశాను’ అంటూ తన ట్విట్‌లో పేర్కొన్నారు.