బాహుబలి డైలాగ్ రైటర్ క్షమాపణ

Baahubali-Tamil-5‘బాహుబలి’ సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌పై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం తెలిసిందే. దీనిపై స్పందించిన బాహుబలి తమిళ వెర్షన్‌‌కు డైలాగులు రాసిన మదన్ కార్కీ క్షమాపణ ఇచ్చారు.

ఎన్ తాయాయుమ్ తాయ్ నాట్టాయ్యుమ్ ఎంద పగడైక్కు పిరందవణుమ్ తొడ ముడియాదు అనే డైలాగులో ‘పగడైక్కు పిరందవన్’ అంటే పాచికలాటలో ఓటమి కారణంగా జన్మించిన వ్యక్తి అన్న అర్థం వస్తుంది. అయితే పగడైక్కులోని ‘పగడాయ్’ అనేది ఓ కులాన్ని సూచిస్తుంది.

‘పగడాయ్’ అనే పదాన్ని సినిమాలో వాడడం తమకు అభ్యంతకరమని , తమిళనాడులోని ఒక కులానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసిందని, వివాదం చలరేగింది. దాంతో డైలాగులు రాసిన మదన్ కార్కీ వివరణ ఇచ్చారు, ఏ వర్గాన్నీ కించపర్చాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు.