చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కు డిమాండ్

chitamaneni-prabhakarకృష్ణా జిల్లా లో ఇసుక మాఫీయాను అడ్డుకున్న ఒక మహిళా తాసిల్లార్ వనజాక్షి పై టిడిపి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేయడంపై ఆయన అనుచరులు, ఆయన గన్ మెన్ దాడి చేసిన ఘటనకు సంబందించి నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయింది.

అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా నిల్చున్న మహిళా తహశీల్దార్‌ను దుర్బాషలాడారు. ఆమెను తీవ్రంగా కొట్టించారు. తమ్మిలేరు నుంచి ఇసుకను చింతమనేని వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దారు వనజాక్షి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియన్నను సంఘటనాస్థలానికి పంపించారు.

టిడిపి ఎమ్మెల్యే, మహిళ అని కూడా చూడకుండా దాడి చేశారని, అయినా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని ఆమె విమర్శించారు. వనజాక్షి ఫిర్యాదు మేరకు ముసునూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

దీనిపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.ప్రభాకర్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తహాశీల్దార్ వనజాక్షి ఈ దాడితో తనకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కలిగిందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు.