రాయలసీమ రైతుల కోసం రూ.1,149 కోట్ల వ్యవసాయాభివృద్ధి నిధి

rp_Chander-Babu-Naidu-298x300-298x300-298x300-1-298x300-1.jpgAP Cabinet approves Rs 1,149 crore for drought-hit areas

రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం జిలాలోని రైతులకు లబ్ధి చేకూర్చేలా రూ.1,149 కోట్లతో అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాయలసీమలో అనావృష్టిని నివారించి రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ఈ వ్యవసాయాభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో చేపడతారు. దీనిద్వారా 1.65 లక్షల రైతు కుటుంబాలకు మేలు చేకూరనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.