అనుష్కకి మరో బంపర్ ఆఫర్

anushka-shettyబాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో చిత్రాలతో అలరించిన అనుష్క మరో బంపర్ ఆఫర్ కూడా పట్టుకున్నారు .

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న రుద్రాక్ష సినిమాలో ఛాన్స్ రావడంతో , కథానాయిక ప్రధాన నేపధ్యంతో కావడంతో , స్టోరీ లైన్ అనుష్కకు బాగా నచ్చడంతో , ఆమె ఓకే చేసినట్టు సమాచారం .

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు , నటుడు ప్రకాశ్ రాజ్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు . అయితే అనుష్క ప్రస్తుతం సింగం 3 తో బిజీగా ఉండగా , జనవరిలో బాహుబలి 2, ఆ తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో భాగమతి చిత్రాన్ని చేయనున్నారు . మరి రుద్రాక్ష సినిమాలో ఎప్పుడు పట్టలేక్కుతుందో ?