ఆనం బ్రదర్శ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లో చేరే అవకాశం

anam-brothers-ysrcp-37378కాంగ్రెసు పార్టీ నాయకులు  జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లో చేరే అవకాశం ఉందని ప్రస్తుతం రాజకీయనాయకుల్లో, నెల్లూరు జిల్లాలో ప్రచారం సాగుతోంది.

వైయస్సార్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనం బ్రదర్శ్ రామనారాయణ రెడ్డి, వివేకానంద లను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది .

జిల్లాలోని ఇతర నేతల అభిప్రాయాలను కనుగొన్న తరువాత జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయాలంటూ తొలి సంతకాలు చేసిన వారిలో ఆనం సోదరులు ముందున్నారు. ఆనం సోదరులు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు.

వైఎస్ ఆర్ సీపీలో చేరే అవకాశాలు ఉండడం వల్లనే ఆనం సోదరులు చాలా కాలంగా జగన్ పై విమర్శలు చేయడం లేదని అంటున్నారు.