ప‌సివాడి ప్రాణం కోసం అల్లు అర్జున్ రూ.8 లక్షలు సహాయం

alluarjunAllu Arjun Rs 8 lakh assistance to a kid

కాలేయం సమస్యతో బాధపడుతున్న భీమవరానికి చెందిన నాగరాజు, దుర్గ ప్రశాంతి దంప‌తుల‌కు ఏడు నెల‌ల బాబు కి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అండగా నిలిచాడు .

ఈ ప‌సివాడి ప్రాణాలతో పోరాడుతున్న విషయం తెలుసుకున్న హీరో అల్లుఅర్జున్ చలించి , అక్షరాలా ఎనిమిది లక్షలు సహాయం చేసాడు . ఈ బాబుకి కాలేయం నుంచి క్లోమరసం స్రవించే నాళం మూసుకుపోయిందని పరీక్షల్లో తేలింది. దీంతో కాలేయం మార్చాల‌ని,అందుకు రూ.31ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని డాక్టర్లు చెప్పారు.

పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.13 లక్షలు , సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు  మంజూరు కాగా , అల్లు అర్జున్ రూ.8 లక్షలు సహాయం చేశారు .

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి లో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు , బాబు కోలుకుంటున్నట్లు సమాచారం .