అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ రివ్యూ

james-bond-reviewMovie : James Bond 2015
Banner: AK Entertainments
Cast: Allari Naresh, Sakshi Chowdhary, Chandramohan, Saptagiri, Posani, Jayaprakash Reddy, Hema, Raghubabu and others
Dialogues: Sreedhar Seepana
Music: Sai Karthik

Rating : 2.5/5

Story
నాని ( అల్లరినరేష్‌ ) సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌. బుల్లెట్‌ ( సాక్షి చౌదరి ) ప్రేమలో పడతాడు. ఈమె జేమ్స్‌ బాండ్ సీక్రెట్‌ స్పై. ఈ విషయం తెలియక అమ్మడి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఆతర్వాత ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్న దాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. ఈ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

Performance
అల్లరినరేష్‌ టైమింగ్ తో కామెడీ పండించాడు. అలాగే సాక్షి చౌదరి నటనతో పాటు అందాలు సినిమాకు అడ్వాంటేజ్‌ అయ్యాయి. పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్‌ వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. అల్లరి నరేష్‌, సాక్షి చౌదరిల నటనతో పాటు సాయి కిషోర్‌ పంచ్‌ డైలాఉగులు, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌ పాయింట్స్.

Analysis
ఊహాజనితమైన స్టోరీలైన్‌, భయపడే భర్త పాత్రలో నరేష్‌ మరోసారి ప్రేక్షకులకు కనిపించడం సినిమాకు మైనస్‌ పాయింట్స్‌. ఇంతకుముందు ఇలా భయపడే భర్త పాత్రలో కితకితలు సినిమా చేశాడు నరేష్‌. దాంతో ప్రేక్షకుడు నరేష్‌ ని కొత్తగా చూడలేకపోయారు. సాయి కార్తీక్ సంగీతం, మంచి కామెడీతో సినిమాకొచ్చిన ప్రేక్షకుడు రిలాక్స్‌ గా ఫీలవుతున్నాడట. చాలా రోజుల తర్వాత మళ్లీ నరేష్‌ కు జేమ్స్‌ బాండ్‌‌ తో హిట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు.