జేమ్స్‌బాండ్‌ గనుక బాహుబలిలో వుంటే

james-bond-reviewజేమ్స్‌బాండ్‌ నేను కాదు.. మా ఆవిడ అనేది కాప్షన్‌ తో ముందుకి వచ్చిన అల్లరి నరేష్ బాహుబలిలో అవకాశం వస్తే చేసేవారా? అని అడిగినప్పుడు ఇలా అన్నారు. బాహుబలి సీరియస్‌ సినిమా… కామెడీ పెద్దగా లేదు. నా కోసం ఓ పాత్ర రాసి.. రాజమౌళి పిలిస్తే బాగుండేదనిపించింది. అదే గనుక వుంటే ఫోన్‌ చేసేవారుకదా.

తన సినిమా జేమ్స్ బాండ్ గురించి మాట్లాడుతూ . ఈ టైటిల్‌ పెట్టేటప్పుదు యూనిట్‌ అంతా తెగ మెచ్చేసుకున్నారు. కథ అంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది. నా కథలకు ఇలాంటి టైటిల్స్‌ కరెక్టే అని పెట్టాం. పెండ్లి చేసుకునే సెటిల్‌ అవుతుదామనుకున్న కుర్రాడికి మాఫియా డాన్‌ లాంటి భార్య దొరుకితే ఏమవుతుందనే కథ.. చాలా ఎంటర్‌టైన్‌గా వుంటుంది అన్నారు..

తన రాబోయే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ , మోహన్‌ బాబుగారు హీరోనే కాదు.. ఆయన కామెడీ చాలా బాగుంటుంది. నేను ఆయన అభిమానిని అన్నారు.