డల్ గా సాగిన అఖిల్ చిత్రం సక్సెస్ మీట్

akhil-nagarjunaఅక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అక్కినేని అఖిల్ చిత్రం ” అఖిల్ – ది పవర్ ఆఫ్ జువా” అనుకున్న అంచనాలు రీచ్ కాకుండా దానికన్నా చాలా తక్కువే కలెక్ట్ చేసింది .

హీరోగా అఖిల్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు, తనపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకునేందుకు అఖిల్ హార్డ్ వర్క్ చేశాడనే చెప్పాలి. అఖిల్ తొలిచిత్రంతోనే ఏకంగా ప్రపంచాన్నే రక్షించే పనిలో పడ్డాడు , దాంతో నేటివిటీ తగ్గి కలెక్షన్స్ కూడా తగ్గాయి . సినిమా కి డివైడ్ టాక్ రావడంతో రోండవ రోజైన గురువారం కలెక్షన్స్ కూడా చాల డ్రాప్ అయ్యాయి.

మరోపక్క , చిత్ర యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ , అఖిల్ తోలి సినిమాతో ఈ స్థాయిలో భారీ వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. అఖిల్‌లో ఇంత గొప్ప డాన్సర్ ఉన్నాడని నాకు తెలీదు అన్నారు.

అఖిల్ మాట్లాడుతూ, చాలా సంతోషంగా ఉందిని ,ఆ మత్తులోనే ఉన్నానని , బ్రహ్మానందం తో నటించడం ఆనందంగా ఉందన్నారు . వినాయక మాట్లాడుతూ , అఖిల్ తోలి సినిమాతో అటు క్లాసు ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించాడు అన్నారు .