అక్బరుద్దీన్ – కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం

Akbaruddin-Owaisi-and-KTRఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ తెలంగాణ అసెంబ్లీసమావేశాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌ లో టోపీ పెట్టుకుని అందంగా కనిపిస్తారని, ఫామ్‌హౌస్‌ పచ్చగా ఉంటుందని, అలాగే ప్రతి రైతు కూడా సంతోషంగా కనిపించాలని అన్నారు .

తెలంగాణ శాసనసభలో ఆయన రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. తెలంగాణలో రోజుకు ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం బాదాకరమని , రైతుల సమస్యల గురించి సభలో మట్లాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నవ్వడమేమిటని ఆయన అన్నారు.

దీనికి కౌంటర్ గా కేటిఅర్ మాట్లాడుతూ , రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, తమపై ఆరోపణలు చేస్తు తేడాగా మాట్లాడుతే ఊరుకోమని అన్నరు.

అక్బరుద్దీన్ మాట్లాడుతూ , వసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతుల ఆత్మహత్యలకు వరుణ దేవుడు కనికరించకపోవడం కారణంగా చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. రైతులవల్లే తెరాస అధికారంలోకి వచ్చిందని , 60 శాతం రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారని , ఆత్మహత్యలకు నేతలంతా బాద్యత వహించాలని అన్నారు. తను టీఆర్ఎస్ నేతలగ మీడియా కోసం మాట్లాడటం లేదని అక్బరుద్దీన్‌ అన్నారు.

దీనికి కౌంటర్ గా కేటిఅర్ ఇలా అన్నారు , మాపై తేడాగా మాట్లాడితే ఊరుకోమని సీదా…సీదాగా మాట్లాడాలని అక్బరుద్దీన్‌‌ను హెచ్చరించారు.

మళ్ళి అక్బరుద్దీన్ మాట్లాడుతూ , తనను సూటిగా మాట్లడమని చెప్పడానికి కేటీఆర్ ఎవరు? తానూ తేడాగా ఏం మాట్లాడానో చెప్పాలన్నారు.