మెగా హీరోలపై కోపంతో ఊగిపోతున్న అదాశ‌ర్మ

adah-sharmaహీరోయిన్ అదాశ‌ర్మ మెగా హీరోలపై చాలు కోపంతో ఊగిపోతోంద‌ట‌!

అదాశ‌ర్మ మెగా హీరో బ‌న్నీతో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో న‌టించింది, అందులో ఒక్క డ్యూయెట్ సాంగ్ కూడా ఉందని ప్రామిస్ చేసారు, సినిమా పూర్త‌య్యాక మార్పుల్లో ఆ పాట‌ల‌ను లేపేశారు.

ఆ త‌రువాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న న‌టించింది ఈ అందాల బొమ్మ . అయితే అదాశ‌ర్మ పాత్ర నిడివి పెద్ద‌గానే ఉంద‌ట‌ అయితే తీరా ఎడిటింగ్‌కి వెళ్లేస‌రికి ఆమె న‌టించిన కొన్ని సీన్ల‌ను క‌త్తిరించరని ,కనీసం 10 నిమిషాలు కూడా తన పాత్ర లేదని , రెండూ హిట్సే కొట్టినా తనకి మాత్రం పేరు రాలేదని తెగబాధపడిపోతోందట.