రేవంత్ బెయిల్‌పై ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఆయన తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారి ముగ్గురు హైదరాబాద్ విడిచి పోరాదని, రూ.5లక్షల వ్యక్తిగత పూచికత్తు, పాస్ పోర్టులను అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

కాగా, రాష్ట్రహైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది . తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ కలిసి మంతనాలు జరిపారు. తెరాస నాయకులూ ప్రేస్స్మీట్లో ఈదే విషయాన్నీ చెపారు.

మరో వైపు తెలుగుదేశం కార్యకర్తలు సంబరలో మునిగిపోయారు , మిటాయులు పంచుకొని , బాణసంచ పేల్చుతూ ఆనందని వక్తపరిచారు .