రేవంత్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్‌

ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైదరాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది

ఓటుకు నోటు కేసు కీలక దర్యాప్తులో ఉందని, రేవంత్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఏసీబీ సుప్రీంకు సమర్పించిన పిటిషన్‌లో పేర్కొంది.ఈ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికను పరిశీలించాల్సి ఉందని ఏసీబీ పేర్కొంది.

ముఖ్యంగా.. నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన రేవంత్కి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులపై పరుష పదజాలంతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ చేసిన ప్రసంగం ఆడియో కాపీలతో పాటు మీసం మెలేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించిన వీడియో సీడీలతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు తమ పిటీషన్ లో జతచేర్చారు