జెఎన్ టీయూ లో 44 అడుగుల పవన్ కల్యాణ్ బర్త్డే కేక్

pawan-cakeపవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు అంటే ఆయన అబిమానులకు పండుగ రోజు , నేడు పవన్ 44వ పుట్టినరోజు సందర్భంగా 44 అడుగుల కేక్ ను జెఎన్ టీయూ విద్యార్థులు క్యాంపస్ లో రెడీ చేసారు .

దీనిని చూడటానికి జనాలు బారులు తీరారు , దాదాపు 600 కిలోల బరువున్న కేక్ ను క్యాంపస్ లో ప్రజలు చూసేందుకు వీలుగా పెట్టారు. జనసేన లోగోతో పవన్ ఫోటోతో డిజైన్ చేయబడిన ఆ 44 అడుగుల కేక్ సంతోషం పంచుతుంది .

పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు . మరో వైపు పవన్ కళ్యాణ్ మాత్రం తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు .