ఆన్‌లైన్ పైరసీ వల్ల సినీ పరిశ్రమకు రూ.350 కోట్ల నష్టం

ktr1తెలంగాణ ఐ టి మంత్రి కెటిఆర్‌ తెలుగు సినీరంగ ప్రముఖులతో బుధవారం భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌ పైరసీని అరికట్టేందుకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆయా విషయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, పోలీసు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

ఆన్‌లైన్ పైరసీ వల్ల ఈ ఏడాదిలో సినీ పరిశ్రమకు రూ.350 కోట్ల నష్టం వచ్చిందని, 200 సైట్లు ఆన్‌లైన్ పైరసీకి చేస్తున్నాయని , తెలంగాణా సర్కార్ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని , సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మంత్రి కేటీఆర్‌ ను కోరినట్లు తెలిపారు.

Telangana IT Minister KTR chaired a meeting with representatives from Film Industry & ISPs, on the issue of curbing online piracy.