ఎన్టీఆర్‌ విగ్రహానికి 27 మందిని బలిచ్చారు : రఘువీరా

raghuveeraమంగళవారం గోదావరి నదిలో శుభ స్నానాలతో ప్రారంభమవ్వాల్సిన పుష్కర స్నానాల్లో మరణమృదంగం మోగడంపై ఏపీ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరా రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ను చంపిన వెన్నుపోటు పొడిచి చంపిన పాపాన్ని కడిగేసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 27 మంది భక్తులను గోదారమ్మ తల్లికి బలిచ్చారంటూ రఘువీరా రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ను చంపిన పాపాన్ని కడిగేసుకోవడానికి ఆయన విగ్రహాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారని… దీనికోసం, ఏకంగా 27 మందిని బలిచ్చారని ఆరోపించారు. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు .

గోదావరి పుష్కరాలలో రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు