మరో హైదరబాద్ ని నిర్మించాలంటే 20 ఏళ్ళు పడుతుంది : చంద్రబాబు

naidu1ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు.

.ప్రత్యేక హోదా ఇవ్వడం తో పాటు విభజన బిల్లులోని అంశాలన్ని అమలు చేయాలని , రెవెన్యూ లోటు కింద కేంద్రం ఇప్పటి వరకు 2వేల కోట్లు ఇచ్చిందని , హైదరాబాద్ లాంటి రాజధానిని నిర్మించుకోవాలంటే 20 ఏళ్లు పడుతుందని 5 లక్షల కోట్ల దాకా ఖర్చవుతుందని అన్నరు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజన చేశారని, దీంతో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, ఉత్తరాంధ్ర, రాయలసీమతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థికసంఘం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలు అమలుచేయాలని కేంద్రాన్ని కోరినట్టు చంద్రబాబు తెలిపారు .