సిఎంఎస్ సర్వే: చంద్రబాబు పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం

naidu-kapuCenter for Media Services (CMS) has conducted a survey over Chief Minister N Chandrababu Naidu’s two-year rule in AP.

According to Survey, Naidu got support of 67% and majority are in a view that Only Naidu can develop the state. But the take on corruption is different. Most of them are in a view that Andhra Minister are not giving their required support to Naidu.

CMS Chairman Bhaskar Rao said that people have sympathy towards Chandrababu Naidu. He stated that people are thinking Chandrababu Naidu is working hard but with no results. He said that welfare schemes introduced by Naidu  reached eligible beneficiaries.

ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) గత నెలలో సర్వే జరిపింది. ఏపీలోని ప్రజలు, రైతుల అభిప్రాయాలతో రూపొందించిన నివేదిక ప్రకారం చంద్రబాబు నాయకత్వం పట్ల ప్రజలు పూర్తి విశ్వాసం ఉంచినట్లు మరోసారి వ్యక్తమైందని సీఎంఎస్‌ పేర్కొంది. చంద్రబాబుకు సరితూగే నేత లేరని అధికశాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. విద్యుత్‌, పెన్షన్లు, రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. హామీల అమలు తీరు, జిల్లాల అభివృద్ధి బాగుందన్నారు. మత సామరస్యానికి ఢోకా లేదన్న ధీమా ప్రజల్లో ఉంది.
నిరంతర విద్యుత్‌ సరఫరాపై ప్రజలు ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాబితాలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందిస్తున్న పింఛన్లు రెండోస్థానంలో, రుణాల మాఫీ మూడో స్థానంలో నిలిచాయి. గ్రామీణ ప్రాంతాలవారు విద్యుత్తు సరఫరా బాగుందని తెలిపారు. పింఛన్లు బాగా అందుతున్నాయన్నారు.
రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చాలాబాగా కష్టపడుతున్నారని ప్రజలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడం చంద్రబాబుకు తప్ప మరో వ్యక్తికి సాధ్యం కాదని 67 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంత ప్రజల్లో 70 శాతం మంది, గ్రామీణ ప్రజల్లో 63 శాతం మంది చంద్రబాబు సమర్థతపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతసామరస్యం చక్కగా ఉందని 61శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని 54 శాతం మంది, వాగ్దానాల అమలుకు చంద్రబాబు కృషిచేస్తున్నారని 59 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు