శ్రీమంతుడు మూవీ రివ్యూ – గుండెని పిండేసాడు

srimanthudu-telugusquare-reviewసినిమా : శ్రీమంతుడు
సినీ నటులు – మహేష్ బాబు, శ్రుతిహాసన్, రాజేంద్రప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం తదితరులు.
దర్శకుడు – కొరటాల శివ
నిర్మాతలు: వై. నవీన్, వై. రవి శంకర్, సి.వి. మోహన్, మహేష్ బాబు
సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్
తెలుగు స్క్వేర్ . కాం రేటింగ్ : 3.75 / 5

కథ

హర్ష (మహేష్ బాబు) కోటీశ్వరుడు, కనిపిస్తాడు, పాతిక వేల కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు. ఆయన తండ్రి రవికాంత్ (జగపతి) అతణ్ని వ్యాపారంలోకి రారమ్మంటుంటాడు. కానీ హర్షకు వ్యాపారం మీద ఆసక్తి ఉండదు..
అలంటి సమయంలోచారుశీల (శ్రుతి హాసన్) పరిచయమవుతుంది. ఇద్దరూ దగ్గరవుతారు. ఐతే చారుశీల ద్వారా తన తండ్రి గతం గురించి కొన్ని నిజాలు తెలుసుకున్న హర్ష.. ఉత్తరాంధ్రలోని దేవరకోట అనే గ్రామానికి వెళ్తాడు. ఇబ్బందుల్లో కనీస వసతులు లేని గ్రామాన్ని చూశాక అదే గ్రామాన్నే దత్తత తీసుకుంటాడు హర్ష. దత్తత తీసుకోవడంతో సరిపెట్టకుండా.. ఆ గ్రామ ప్రజలకు ఏర్పడే సమస్యల్ని పరిష్కరిస్తూడు…. ఆ గ్రామంతో రవికాంత్ కు సంబంధమేంటి? హర్షకు ముందున్న అడ్డంకులు అధిగమించడానికి ఏం చేశాడు?

ఎనాలిసిస్

 

శ్రీమంతుడు ఫస్ట్‌ ఆఫ్‌ కాస్తా స్లోగా ఉందని సెకండ్‌ ఆఫ్‌ ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఉపేసింది . ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా శ్రీమంతుడు సెంటిమెంట్ సీన్లతో క్లైమాక్స్ లో ఇరగదీసాడు . మహేష్ కిది కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు పాటలు వినడానికే కాదు, చూడ్డానికీ బాగున్నాయి. ఆర్ మది సినిమాటోగ్రఫీ బాగుంది.

శ్రీమంతుడు సినిమా చూస్తున్నంత సేపూ కూడా తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే ఆసక్తికరంగా చెప్పటంలో విజయవంతమైయ్యాడు డైరెక్టర్ కొరటాల శివ . కథనాయకుడిని లక్ష్యంతో కడుండా కధను బట్టి సినిమాను నడిపించాడు . ఎక్కడా ఎమోషన్ పండేలా చూసుకున్నాడు. కథనం కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో పదునైన డైలాగ్స్ తో కవర్ చేసాడు. కొరటాల రాసిన డైలాగులు , మహేష్ పలికిన తీరు చూస్తే ఎవ్వరైనా ఇంప్రెస్స్ అవాల్సిందే .

క్లైమాక్స్ ఫైట్ కు ముందు సీన్స్ హీరో తనలోని మానసిక సంఘర్షణను తండ్రి దగ్గర బయటపెట్టే సన్నివేశం సినిమాకు హైలైట్ నిలుస్తాయి . ఎమోషనల్ హైతో ప్రేక్షకులు బయటికి వచ్చేసమయానికి దర్శకుడు మాస్ ఆడియన్స్ కోసం యాక్షన్ సన్నివేశాలతో ముగించాడు . చెప్పలాంటి మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .

తీర్పు
శ్రీమంతుడు’ తప్పక చూడాల్సిన సినిమా –  కంప్లీట్ ఫ్యామిలీ  ఎంటర్టైనర్