‘రౌడీ అల్లుడు’ సినిమాకి 25 సంవ‌త్స‌రాలు

rowdy-alluduమెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కులుగా, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించిన సెన్సేష‌నల్ మూవీ ‘రౌడీ అల్లుడు’ సినిమాకి అక్షరాలా పాతికేళ్ళు .

అక్టోబ‌ర్ 18, 1991లో విడుదలైన ఈ చిత్రం నేటితో 25 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కామెడీ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌ గా అభిమానులను ఎంతగానో అలరించింది.

చిరంజీవి ద్విపాత్రాభిన‌యం కనిపించి మేపించారు , అటు మాస్ ఆటో జాన్నీ గా ఇటు వ్యాపారవేత్త పాత్రలో కల్యాణ్ హుందాగా కనిపిస్తాడు .

శోభన, దివ్య భారతి క‌థానాయికలుగా రూపొందిన ఈ చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ త‌ర్వాత ఆ రేంజులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.