రోజా లెగ్ తో రణరంగంగా మారిన నాగార్జున యూనివర్సిటీ

rojaగుంటూరు నాగార్జున యూనివర్సిటీ రణరంగంగా మారింది., విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబూరావుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే,సినీ నటి రోజా ఆరోపించారు .

వైసీపీ నిజనిర్ధారణ కమిటీ యూనివర్సిటీ లో పర్యటించింది, వైసీపీ బృందాన్ని టీఎన్ఎస్ఎఫ్ నేతలు అడ్డుకున్నారు, దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.వీసీ ఛాంబర్లోకి వెళ్లిన వైసీపీ నేతలు, ప్రిన్సిపాల్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. రిషితేశ్వరికి న్యాయం జరిపించాలని వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంలోని అక్క,చెల్లో, మరొకరు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే ప్రవర్తిస్తారా అని ఆమె అన్నారు. ప్రిన్సిపాల్ ను మొదటి ముద్దాయిగా చేయాలని, ఆయన తాగి తందనాలు ఆడడడం వీడియోలలో కూడా వచ్చిందని, ఆడపిల్లలతో అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.

మరోపక్క రిసితేశ్వరి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూనివర్శిటీలో సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ బాబూరావు పై కేసు నమోదు అయింది. బాబూ రావుపై యూనివర్శిటీ రిజిస్ట్రార్ రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.