రేవంత్ 10 మంది ఎమ్మెల్యేలను కొంటే కేసీఆర్ ప్రభుత్వం పడిపోయేది

revanth-111ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిరీక్షణ తప్పేతట్టులేదు, రేవంత్ బెయిల్‌ పిటీషన్‌పై తీర్పును హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే విచారణ ముందుకుసాగదన్నారు. రూ.50 లక్షలు రేవంత్‌కు ఎక్కడ నుంచి వచ్చాయో తేలాల్సి ఉందని. అంతేకాకుండా వీడియోలో పేర్కొన్నట్లుగా మిగిలిన రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సిన అవసరముందన్నారు. ఓ ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించారని, 10 మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వం పడిపోయేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి .

మరోవైపు రేవంత్ తరఫు న్యాయవాది ఈ కేసులో ఇంకా విచారించాల్సింది ఏమీ లేదని, అన్ని రికార్డులను ఏసీబీ సీజ్ చేసిందన్నారు. రేవంత్ అరెస్ట్‌లో కుట్ర దాగి ఉందని, 171(బి), 171(ఈ) ప్రకారం కేసు నమోదు చేయాలని రేవంత్ తరఫు లాయర్ వాదించారు. ఈ కేసును రేవంత్ ప్రభావితం చేస్తారనడంలో అర్థం లేదని పేర్కొన్నారు.