రేవంత్ రెడ్డి రిమాండ్ పొడిగింపు

revanth-reddyఓటుకు నోటు కేసు నిందితులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలకు ఈ నెల 29 వరకు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది.

తాను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీలో అన్ని విషయాలను చెప్పానని, ఇక చెప్పడానికి ఏమీ లేదని అందులో పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను ఇరికించారన్నారు. అన్ని వివరాలు చెప్పానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని , రిమాండ్‌ను పొడిగించాలని ఏసీబీ మెమో దాఖలు చేసింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వచ్చాక మరికొంతమంది సాక్షులను విచారించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో, రేవంత్‌తో పాటు మిగిలిన వారి రిమాండ్‌ను కూడా జూన్ 29వ తేది వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.