మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి : జగన్

jaganవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు, నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విలేకరులతో ఆయన మాట్లాడారు

కడప రిమ్స్ ఆస్పత్రి వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులను మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించారు., రాష్ట్రవ్యాప్తంగా 15 నెలల్లో నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థులు మృతి చెందారు వీరిలో 9 మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

నారాయణ కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు, ద్దరు విద్యార్ధినుల ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ జరగాలి, మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి డిమాండ్ చేశారు. రేపు కడప నగరం బంద్ కు పిలుపునిచ్చారు.