భీమవరంలో ఉద్రిక్త : 10 మంది పవన్ కళ్యాణ్‌‌ ఫ్యాన్స్ అరెస్టు

pawan-fans-clash-bimavaamజనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌‌కు చెందిన 10 మంది అభిమానులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భీమవరంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ పుట్టినరోజు సందర్భంగా  ఫ్యాన్స్  ఫ్లెక్సీలను  పవన్ ఫ్యాన్స్ ఏర్పాటుచేశారు. వీటిని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు, అనుమానిత వ్యక్తుల (ప్రభాస్ ఫ్యాన్స్) ఆస్తులను ధ్వంసం చేశారు పవన్ ఫ్యాన్స్. చివరకు రెండు కులాల ఘర్షణగా మారిపోవడంతో ముందు జాగ్రత్తగా భీమవరం పట్టణ వ్యాప్తంగా 144 సెక్షన్‌ విదించారు.

కేసులు నమోదు కాగా , పవన్ కల్యాణ్ అభిమానులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్.. పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శనివారం ఉదయం భీమవరంలో ఉద్రిక్త గా మారింది. మరో వైపు మున్సిపల్ సిబ్బడి అన్ని ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.