బిడ్డా, కేసీఆర్ ! సన్నాసిని తెలంగాణ జాతి పిత అని అంటున్నారు : రేవంత్

revanth-47784784చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆరెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రేవంత్ మాట్లాడుతూ ‘బిడ్డా, కేసీఆర్! వస్తున్నా. రాష్ట్రంలో టీడీపీని అంతం చేస్తానన్న వ్యక్తి పావురాల గుట్టలో కలిసిపోయాడని.. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదన్నారు.

“నాకు బెయిల్ వచ్చింది, కేసీఆర్‌కు జ్వరం వచ్చింది” అన్నారు. నాపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారు, తెలంగాణ Govtను నాపైప్రయోగించి జైలు లోపెట్టారు, నాకు అండగా కార్యకర్తలున్నారు.

“కేసీఆర్… నువు నిజంగా తెలంగాణ వాడివే అయితే, నీలో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారిని రాజీనామా చేయించు” అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మందులోకి సోడా పోసినోళ్లంతా మంత్రులయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. తాగుబోతును జాతిపిత అని సన్నాసులు అంటున్నారని, తాగుబోతు ఎక్కడైనా జాతిపిత అయితడా? అని రేవంత్ ప్రశ్నించారు.

“రెండు పెగ్గులేస్తే కానీ లేవలేని సన్నాసి ఉద్యమాన్ని నడిపాడని అంటున్నారు. అంతేకాదు, తెలంగాణ జాతి పిత అని కూడా అంటున్నారు. ఈ సన్నాసి ఉద్యమం చేస్తే ఆ సన్నాసులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు” అని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను ఏమంటారని, వారి త్యాగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి నిలదీశారు. అమర వీరుల వల్లే తెలంగాణ సాధ్యమైందని