ఫోన్ ట్యాపింగ్ ఫై సీబీఐ విచారణ జరిపించాలి : పవన్

pawan3ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం . రాజకీయ క్రీడలకు అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? రెండు రాష్ట్రాల సీఎంలకు చాలా బాధ్యతలున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా చేసుకుంటూ వెళ్లిపోతే.. ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తారా?. నిజానిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ జరిపించాలి. అది నిజమైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి.

ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తరువాత కూడా రాజకీయ ఎత్తుగడలతో గేమ్‌లు ఆడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చాలా బాధ్యతలున్నాయి, ఎన్నో సమస్యలు పరిష్కారం కాలేదని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని, సమస్యల పరిష్కారం పక్కనపెట్టి, పార్టీల అవసరాలే లక్ష్యంగా ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారని దుయ్య బట్టారు.