ప‌వ‌న్ అభిమాని హ‌త్య‌పై ఎన్టీఆర్ బ‌హిరంగ లేఖ

ntrగ‌త ఆదివారం క‌ర్ణాట‌క‌లోని కోలార్ జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ అభిమాని, ప‌వ‌న్ అభిమాని మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఎన్టీఆర్ అభిమాని చేతిలో ప‌వ‌న్ అభిమాని హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న స్పంద‌న‌ను బ‌హిరంగ లేఖ రూపంలో తెలియ‌జేశాడు

ఎన్టీఆర్ లేఖ‌:
తెలుగు సినిమాను ప్రేమించి వాళ్లంద‌రికి నేను శిరస్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. తాత‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు గారి అభిమానుల‌కు, బాబాయ్ బాల‌కృష్ణ అభిమానుల‌కు, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల‌కు, మెగా ఫ్యామిలీ అభిమానుల‌కు, ప‌వ‌ర్‌ష్టార్ అభిమానుల‌కు, ప్ర‌భాస్ అభిమానుల‌కు , నా అభిమానుల‌కు నా మ‌న‌వి. ప్రేమించే అభిమానుల‌ను గుండెల్లో పెట్టుకోవాలే కాని.. వారిపై ప్రాణాలు తీసుకునేంత అభిమానం పెంచుకోవ‌డం మంచిది కాద‌ని తెలియ‌జేస్తున్నాను. తెలుగు చిత్ర‌సీమ‌లో హీరోలంద‌రూ మీకోస‌మే ఉన్నారు. మీమ్మ‌ల‌ను సంతోష‌ప‌ర‌చ‌డం కోస‌మే మేము క‌ష్ట‌ప‌డుతున్నాము… అంతేకాని మీరు ఇలా ప్రాణాలు తీసుకోవ‌డం భావ్యం కాదు… మేమంతా స్నేహ‌పూర్వ‌కంగా క‌లిసిమెలిసి ప‌నిచేస్తున్నాం. కానీ అభిమానుల్లోనే వ‌ర్గాలుగా చీలి అల్ల‌ర్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఏ హీరో కూడా హ‌ర్షించ‌రు.

 

ntr-letter