ప్రత్యేక హోదా కోసం రాజీనామాకు సిద్ధం : జగన్‌

jagan-nriఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కొమ్మినేనితో కలసి ప్రవాసాంధ్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ..

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీల రాజీనామా ‘బ్రహ్మాస్త్రం’ వంటిదని.. సరైన సమయంలో దానిని ఉపయోగిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.

అరుణ్ జైట్లీ సెప్టెంబరు 7న ప్రకటన చేసే సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిచెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. హోదా ఉంటే వంద శాతం ఆదాయపన్ను కట్టాల్సిన పని లేదు. ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చినా ఇవి ఉంటాయి. అని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ నుంచి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయిస్తే మేం ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా స్వీకరించడానికి తయారుగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అవినీతి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని జగన్ విమర్శించారు.

YSRCP president and the leader of opposition in AP, YS Jagan interacted with NRIs through video conference over special status to Andhra Pradesh. He said, His party MPs are ready to give resignation for achieving the special status to AP.