ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు : చిరంజీవి

chiranjeevi-angryఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఖధం తొక్కింది, కాంగ్రెస్ నిర్వహించిన ‘పోరు సభ’లో అపశ్రుతి చోటుచేసుకుంది , ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చిరంజీవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ భారతదేశం పరువు తీశారని మండిపడ్డారు, విదేశాల్లో ఇండియాని ” స్కాం ఇండియా” గా ప్రచారం చేసారని దుయబట్టారు .

యూపీఎ హయాంలో అన్నీ స్కాములు జరిగాయని పరువు తీశారనీ, కానీ అసలు స్కాములు ప్రస్తుతం జరిగినా ఆ మంత్రులనే కొనసాగిస్తూ ఉన్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ ఎక్కడైనా అవినీతి జరిగిన వెంటనే చర్యలు తీసుకుని వారిని రాజీనామా చేయించేవారని చెప్పారు.

నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా విషయంలో మౌనముద్ర ఎందుకు దాల్చారని నిలదీశారు, తిరుపతి సభలో మాట ఇచ్చిన మోడీ అది కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే అని అర్ధం అవుతుందని అన్నారు .

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదం ఇచ్చారు మన మెగా స్టార్ , మోదీ మెడలు వంచి హోదాను తెస్తామన్నారు.