పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ నరేంద్ర మోడీ

pawan-modiభూసేకరణ విషయంలో తన పట్టు సాదించుకొన్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్ , తన దృష్టి ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ పై మళ్ళించారు .

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని, రాష్ట్ర ప్రజలకు తగిలిన గాయాల గురించి గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి వివరించానని, అయన అర్థం చేసుకున్నారని పవన్‌ తన ట్వీట్‌లో తెలిపారు.

కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానన్న పవర్ స్టార్, హోదా ఇవ్వడం ఇప్పటికే ఆలస్యమైందని, దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని భావోద్వేగాలకు పోవద్దని, ఇంకొంతకాలం వేచిచూద్దామని , అప్పటికీ న్యాయం జరగని పక్షంలో ఎలా సాధించాలో ఆలోచిద్దామన్నారు.