పవన్ కళ్యాణ్ దూకుడు తో భూసేకరణ నోటిఫికేషన్ పై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం

pawan4జనసేన నేత పవన్ కళ్యాణ్ దూకుడు తో భూసేకరణ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మంత్రి నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మొదటి నుంచి భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని, చంద్రబాబు దృష్టికి తేకుండానే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినట్టు , ఇప్పుడు చంద్రబాబు,పవన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. భూసేకరణ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వతే భూసమీకరణ కింద వెయ్యి ఎకరాలు తీసుకున్నామన్నారు. తప్పనిసరి అయితే భూసేకరణకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పారు.

పవన్ కళ్యాణ్  భూసేకరణ నోటిఫికేషన్ పై  చాల సీరియస్ గా ముందుకు వెళ్లారు .  గ్రామలో పర్యటించి  రైతులకి అండగా నిలిచాడు , ధర్నా కూడా చేస్తానని ప్రకటించారు . దాంతో ప్రభుత్వం దిగిరాక  తప్పలేదు .